చలో ఢిల్లీని విజయవంతం చేద్దాం

Nov 29,2023 17:04 #Annamayya district
call to sucess chalo delhi

వ్యవసాయ కార్మిక సంఘం

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : భారత రాజ్యాంగం కల్పించిన దళిత హక్కుల పరిరక్షణ కోసం, సామాజిక న్యాయం కోసం మరియు దళిత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 4న చలో ఢిల్లీలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్వేలి రవికుమార్, వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పందికాళ్ళ మణి, కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ ఓబిలి పెంచలయ్య పిలుపునిచ్చారు. బుధవారం రాజంపేట ఆర్ అండ్ బి బంగ్లా నందు చలో ఢిల్లీ కి సంబంధించిన కరపత్రాలను విడుదల చేసి ఈ సందర్భంగా చిట్వేలి రవికుమార్, పందికాళ్ళ మణి, ఓబిలి పెంచలయ్య లు మాట్లాడుతూ సామాజిక హక్కులు, ఆర్థిక, భూమి, దళిత సమస్యలు తదితర 21 డిమాండ్ల పరిష్కారం కోసం భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు కోటి సంతకాలతో కూడిన విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా నేటికీ దళితులపై దాడులు, అత్యాచారాలు, మానభంగాలు జరుగుతున్నాయని అన్నారు. మణిపూర్ లో మనువాదుల చేతుల్లో ఇద్దరు మహిళలను నగ్మంగా ఊరేగించి అత్యాచారం చేయటం యావత్ భారతదేశానికి తలదించుకునేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత హక్కులను పాలక పక్షాలు హరించి వేస్తున్నాయని., ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా దళితులకు ద్రోహం చేస్తున్నాయన్నారు. అలాగే ఉపాధి హామీ పథకంలో ప్రతి ఒక్కరికి 200 రోజులు పని దినాలు కల్పించి కనీస వేతనం రూ 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం, దళిత సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయ కార్మిక సంఘం , కెవిపిఎస్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు కొత్తనాని, జిలకర సిద్దేశ్వర, మల్లికార్జున, మల్లారపు చిన్న, లక్ష్మయ్య, సాదక్ భాష, దుర్గయ్య, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️