అక్రమ బుసక తోలకాలు అరికట్టాలి

Nov 29,2023 13:22 #Krishna district
busaka illegral transport

ఎంపీటీసీ సభ్యులు తాడికొండ చిన్నా

ప్రజాశక్తి-ఘంటసాల : ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం కృష్ణానది నుంచి జరుగుతున్న బుసక అక్రమ తోలకాలను తక్షణమే నిరోధించాలని శ్రీకాకుళం ఎంపీటీసీ సభ్యులు, రాష్ట్ర తెలుగు యువత నాయకులు తాడికొండ వెంకటేశ్వరరావు(చిన్నా) డిమాండ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా శ్రీకాకుళం కృష్ణానది నుంచి బుధవారం యంత్రాల సహాయంతో టిప్పర్లలో బుసక అక్రమ రవాణాకు జరుగుతుందని, ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ప్రక్రియ జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. టిప్పర్ బుసుక 5000 చొప్పున విక్రయాలు చేపడుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, బుసక తవ్వకాలు నిలుపుదల చేయకపోతే టిడిపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అక్రమ బుసక తోలకాలు చేపడుతున్నట్లు చూసి ఫోటోలు చిత్రీకరించిన నేపథ్యంలో కొద్దిసేపు సబ్దుగా ఉన్నట్లు ఆయన తెలిపారు. అనుమతులు లేకుండా తోలకాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరుతున్నారు.

➡️