ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్ : అర్హులందరికీ సంతృప్తికర స్థాయిలో పథకాలు అందేలా చూడాలని ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. 25వ డివిజన్ లో ఇటీవల నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై ఆయన శనివారం అధికారులలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులై ఉండి ఏదేని కారణాలతో పథకాలు అందని వారికి సదరు సమస్యలను సరిచేసి పథకాలు అందేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా సదరు సచివాలయం పరిధిలో 40 లక్షల విలువైన అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.
కార్పొరేటర్ గునిపూడి శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ గుడిదేసి శ్రీనివాసరావు, వైసీపీ జిల్లా కోశాధికారి మంచెం మైబాబు, కమీషనర్ వెంకటకృష్ణ, తహసిల్దార్ సోమశేఖర రావు, పిఓ కృష్ణమూర్తి, ఎంహెచ్ఓ మాలతి, పలుశాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.