ప్రజాశక్తి-అద్దంకి : సమాజంలో ఎందరో ఉన్నత విద్యనభ్యసించడానికి తెలివితేటలు జ్ఞానం ఉన్నప్పటికీ కొంతమంది విద్యార్థులకు ఆర్థిక సమస్యలు సమాజంలో ఉత్పన్నమవుతున్నాయి. విద్యార్థి దశ నుండి ఎంతో కృషి పట్టుదలతో ఉన్నత స్థాయికిఎ దిగిన విద్యార్థులు సమాజములు చదువు అంటే ఇష్టమెరిగిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి ముందున్నారు. పదవ తరగతి పూర్వపు విద్యార్థులు 1992- 93 బ్యాచ్ కి చెందిన ఎన్ ఆర్ ఐ కూకట్ల శ్రీనివాసరావు పట్టణంలోని మొండితోక పాలెం చెందిన మొండితోక అశోక్ ఇటీవల గ్రూప్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఫీజులు కొరకు ఇతర బుక్స్ కొరకు 20వేలు రూపాయలు ఆర్థిక సహాయాన్ని తన స్నేహితులు సోమేపల్లి రాము,కోనేటి నాగేశ్వరరావు చేతుల మీదగా ఆర్థిక సహాయాన్ని అశోక్ కు శుక్రవారం పట్టణంలోని ఒక ప్రైవేటు కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థి అశోక్ వారికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగిన తరువాత నా వంతుగా ఇతర విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలను ఇస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు పాల్గొన్నారు.