ఏసీబీ వలలో సచివాలయ అధికారి

Nov 24,2023 13:24 #ACB Raids, #amaravati, #Sachivalayam

ప్రజాశక్తి-అమరావతి : లంచం తీసుకుంటూ సచివాయ అధికారి ఏసీబీకి చిక్కాడు. నిందిత అధికారి ఒంటెద్దు నాగభూషణ రెడ్డి S/o నాగిరెడ్డి(42) వెలగపూడి ఏపీ సచివాలయంలో ఆర్థిక శాఖలో సెక్షన్ ఆఫీసర్ (సంక్షేమం-II) పనిచేస్తున్నారు. రూ.40,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించినప్పుడు ఎసిబి అధికారులు పట్టుకున్నారు. కర్నూల్ జిల్లా బాలాజీనగర్‌కు చెందిన ఫిర్యాదుదారు మహమ్మద్ నదీమ్ హుస్సేన్ నుండి “విదేశీ విద్య” కింద ఫిర్యాదుదారు చిన్న కుమారుడు అజంతుల్లా షరీఫ్‌కు స్కాలర్‌షిప్ మొత్తం విడుదలకు సంబంధించిన ఫైల్‌ను ప్రాసెస్ చేయడానికి లంచం డిమాండ్ చేశారని తెలిపారు. దీంతో ఎసిబిని ఆశ్రయించగా పథకం ప్రకారం లంచం తీసుకుంటున్న సమయంలో అధికారిని అరెస్టు చేశారు.

➡️