పోలవరం: అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 8 నుంచి జరిగే సమ్మెకు ప్రజలందరూ మద్దతు నిచ్చి జయప్రదం చేయాలని సిఐటియు పోలవరం మండల కార్యదర్శి పిఎల్ఎస్.కుమారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మాట్లాడుతూ స్త్రీ శిశు సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న అంగన్వాడీ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ లీడర్ పద్మావతి, సిహెచ్.మణి, సత్యవేణి, అంగన్వాడీ హెల్పర్స్ పాల్గొన్నారు.