వాల్‌పోస్టర్ ఆవిష్కరిస్తున్న సిఐటియు నాయకులు
27,28 తేదీల్లో మహాధర్నా
ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరు సిఐటియు ఆధ్వర్యంలో ఈనెల 27, 28 రెండు రోజులు విజయవాడలో జరుగుతున్న మహాధర్నాన్ని జయప్రదం చేయాలని వాల్‌పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. సిఐటియు కందుకూరు పట్టణ అధ్యక్షులు డి రామ్మూర్తి , ఉపాధ్యక్షులు ఎ అనురాధ ,సహాయ కార్యదర్శి ఎస్‌ఏ గౌస్, పట్టణ కమిటీ సభ్యులు పద్మ, షబ్బీర్ పాల్గొన్నారు.కాంటాక్ట్ కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ,ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ప్రభుత్వ కార్యాల యాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరికీ గుర్తించాలని ఈనెల 27, 28 విజయవాడలో జరుగుతున్న మహాధర్నాలో అందరూ పాల్గొనాలని జయప్రదం చేయాలని కోరారు.సిఐటియు పట్టణ నాయకులు పవన్ కుమార్ పాల్గొన్నారు.