27, 28 తేదీల్లో మహాధర్నాను జయప్రదం చేయండి

మహాధర్నాను జయప్రదం

ప్రజాశక్తి – తాళ్లరేవు

ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడలో జరిగే మహాధర్నాను కార్మికు లంతా జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి శేషు బాబ్జి పిలుపునిచ్చారు. స్థానిక ప్రజాసంఘాల భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టి. ఈశ్వరరావు ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌. నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు పండించే అన్ని పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, కార్మికులకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని, ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించి 200 రోజులు పని దినాలు, రూ. 600లు కూలి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలపై దాడి చేస్తూ అన్ని రకాల వస్తువులు ధరలు పెంచుతుందన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే మహాధర్నాకు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు విజయవాడ రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు వళ్లు రాజబాబు, చంద్రమల్ల పద్మ, చల్లా సంతోష్‌ కుమార్‌, మందనక్క తణుకు రాజు, దడాలబ్బులు, పాలెపు ఈశ్వరరావు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

➡️