ప్రజాశక్తి – వినుకొండ : కార్మికులు, కర్షకుల సమస్యల పరిష్కా రం కోసం విజయవాడలో, రైతు, కార్మిక అఖిల పక్షాల సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించే మహా ధర్నాను జయప్రదం చేయాలని నాయ కులు పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణ ంలో శుక్రవారం మైకు ప్రచారం చేపట్టారు. సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.హనుమంతరెడ్డి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రాము ప్రచారాన్ని ప్రారంభించి మాట్లాడుతూ వ్యవసాయన్ని దెబ్బతీసేలా, కార్మికుల హక్కులను హరిం చేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విధానాలను అమలు చేస్తోదంని విమ ర్శించారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి ఎరు వుల ధరలను మూడు రెట్లు పెంచిందని మండిపడ్డారు. ఇంధన ధరలు విపరీతంగా పెంచారని, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. వ్యవసా య మోటార్లకు మీటర్లు పెట్టాలనే కేంద్రం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ ఏడాది వర్షాభావం, నాగార్జున సాగర్ కుడి కాల్వకు నీరు విడుదల చేయని కారణంగా లక్షలాది ఎకరాల్లో పంటను వెయ్యని పరిస్థితి నెలకొందని, జిల్లాలో అనేక ప్రాంతాల్లో 1000 అడుగుల పైన బోర్లు వేసిన నీళ్లు రావడం లేదని చెప్పారు. ఈ సమస్యలేమీ ప్రభుత్వాలకు పట్టడం లేదన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ధర్నాకు ప్రజలు తరలిరా వాలని కోరారు. కార్యక్రమంలో బి.శ్రీనివాసరావు, బి.వెంక టేశ్వర్లు, కె.శివరామకృష్ణ, మల్లికార్జునరావు, ఎ.కోటేశ్వరరావు, ఖాసిం, ఎ.ఆంజనే యులు, ముని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.