ప్రజాశక్తి-కాకినాడ ఈ నెల 2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం అమరావతి నుంచి నిర్వహిరచిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ కృతికా శుక్లా ఇఆర్‌ఒలతో కలిసి హాజరయ్యారు. కాకినాడ జిల్లాలో ఎస్‌ఎస్‌ఆర్-2024కి సంబంధించి వివిధ అంశాలను జిల్లా కలెక్టర్ సిఇఒకు వివరించారు. మార్పులు చేర్పులు తొలగింపు అభ్యంతరాలకి సంబంధించి ఫారం-6, 7, 8 పరిష్కారాలు, ముసాయిదాపై రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి అందిన దరఖాస్తులకు పరిష్కారం, మీడియా కథనాలు, ఎపిక్ కార్డులు ముద్రణ, పంపిణీ, 18-19 సంవత్సరాల మధ్య ఉన్న ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్, నోడల్, సెక్టోరల్ అధికారులు నియామకం, ఫోటో, డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీలు, పది అంతకంటే ఎక్కువ ఒకే డోర్ నెంబర్ ఉన్నవి వంటి అంశాలపై పురోగతిని కలెక్టర్ సిఇఒకు వివరించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో ఈ నెల 2, 3 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వీటిని జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకూ నమోదైన ఫారం 6, 7, 8 దరఖాస్తుల పరిశీలన, పరిష్కారాలను గడువులోపు పూర్తి చేస్తామనప్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌ఒ కె.శ్రీధరరెడ్డి, ఎన్నికల విభాగం డిటి ఎం.జగన్నాథం, సిబ్బంది పాల్గొన్నారు.