మాట్లాడుతున్న యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య
న్యాయం చేయాలని ఆందోళన చేస్తే..అక్రమ కేసులా
.యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ: నెల్లూరు జిల్లా మనుబోలు మండలం, వీరంపల్లి సబ్ స్టేషన్ లో తొలగించిన భానుచందర్‌కు న్యాయం చేయాలని విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తే జిల్లా పోలీస్ అధికారులు గిరిజన సంఘాల నేతలపై నాన్ బెయిలబుల్ తో అక్రమ కేసులు నమోదు చేశారని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసి పెంచలయ్య పేర్కొన్నారు.నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల పక్షాన పోరాడుతుంటే అక్రమ కేసులను బనాయించడం ఏమిటని ప్రశ్నించారు.మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రోత్సాహంతోనే తమపై కేసులు నమోదు చేశారని త్వరలోనే మంత్రి కాకాణిని ఇంటికి పంపుతామని హెచ్చరించారు. వైసిపి నేత సురేందర్ రెడ్డి ఏం చెబితే మంత్రి కాకాణి చేస్తున్నాడని విమర్శించారు. తమపై నమోదు చేసిన అక్రమ కేసులపై రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లిఎస్టీ కమిషన్ దష్టికి తీసుకు వెళ్తున్నామన్నారు. గిరిజనుడ్ని తొలగించిన స్థానంలో గిరిజనేతురుడు ఉద్యోగంలోకి ఎలా తీసుకుంటారని, అనిల్ అన్న గోనుపల్లి అంకయ్య అక్కడే షిప్ట్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడని, వీరంపల్లి సబ్ స్టేషన్ సురేంద్రరెడ్డి అడ్డానా అని ప్రశ్నించారు. నిన్న మాట్లాడిన గిరిజన సోదరుడు ఈ విషయం తెలుసుకోవాలన్నారు.రెండు రోజుల్లో అన్ని పార్టీలు, దళిత, గిరిజన, బిసి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.అనంతరం జనసేన నేత గునుగుల కిషోర్, బొబ్బేపల్లి సురేష్ లు అక్రమ కేసులను ఖండించారు. భానుచందర్ కు న్యాయం చేసే వరకూ పోరాటం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో చెంబేటి ఉష, కల్లూరు వరలక్ష్మి, యల్లంపల్లి రమేష్, కొమరగిరి దయాకర్, ప్రభావతి, గణేష్. లోక్ సాయి, మాకాని రవీంద్ర, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.