మాట్లాడుతున్న కమిషనర్
జ్యోతిరావు పూల్ వర్థంతి
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:భారత దేశంలో మహిళలకు సమాన హక్కులు సాధించడంతో పాటు అంటరానితనం, కుల వ్యవస్థల నిర్మూలనకు కషి చేసి, ప్రజల హక్కుల కోసం పోరాడిన సామాజిక దార్శినికుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే జీవితాన్ని ప్రతి ఒక్కరూ చదివి తెలుసుకొని ఆదర్శంగా తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ ఆకాంక్షించారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక అసమానతలపై అలుపెరగని పోరాటం చేసి, అణగారిన వర్గాల విద్యాభివద్ధి కోసం కషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని కొనియాడారు.కార్యక్రమంలో అదనపు కమిషనర్ శర్మద, ఇంజినీరింగ్ ఎస్.ఇ సంపత్ కుమార్, మేనేజర్ ఇనాయతుల్లా, టి.పి.ఆర్.ఓ ప్రసాద్, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.