మాట్లాడుతున్న హేనసుజన
నాడు-నేడు పనుల్లో పారదర్శకత ముఖ్యం
ప్రజాశక్తి-కోవూరు:కోవూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 157 అంగన్వాడీ భవనాలకు నాడు-నేడు 2వ దశ కింద మరమ్మతులు చేసేందుకు నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని, చేపట్టే పనుల్లో పారదర్శకత అవసరమని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హేనాసుజన అన్నారు. కోవూరులోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ప్రాజెక్టు పరిధిలోని నాలుగు మండలాలకు సంబంధించిన పనులు మంజూరైన అంగన్వాడీ కార్యకర్తలతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాడు-నేడు రెండవ దశలో కోవూరు ప్రాజెక్టులో మంజూరైన అంగన్వాడీ భవనం నం బందించి చేపట్టే మరమ్మతులు కేంద్రానికి పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా ఉండాలన్నారు. ముఖ్యంగా ఈ పనులకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలకు లోబడి సాగాలన్నారు. ముఖ్యంగా ప్రతి అంగన్వాడీ కేంద్రానికి సంబందించి మదర్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అదేవిధంగా వీటికి సంబంధించి బ్యాంక్ ఖాతాలు కూడా వెంటనే ఓపెన్ చేసేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ. కార్యకర్తలు హక్కులతో పాటు వారికి కేటాయించిన విధులు, బాధ్యతలను సక్రమంగా నిర్వహించినప్పుడే ఉపయోగగంగా ఉంటుందన్నారు. జిల్లాలోనే ఈ పనుల విషయంలో కోవూరు ప్రాజెక్టు ముందులాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు సీడీపీఓ జ్యోతి, ఏసీడీపీఓ అరుణ, సూపర్వైజర్లు వి. శకుంతల, ఏ, రాధిక, ప్రమీల, వదు, ప్రసన్న, సుమిత్ర, నిర్మల, నాగభూషణమ్మ, ఉమా, రమణిలు పాల్గొన్నారు.