Nov 27,2023 19:37
మాట్లాడుతున్న బాపిరెడ్డి

మాట్లాడుతున్న బాపిరెడ్డి
బిఎల్‌ఒలు బాధ్యతగా విధులు నిర్వహించాలి.
ప్రజాశక్తి-కోవూరు:కోవూరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి పోలింగ్‌ బూత్‌ అధికారి వారికి కేటాయించిన విధులు, బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని ముదా వైస్‌ చైర్మన్‌. కోవూరు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి బాపిరెడ్డి అన్నారు. కోవూరులోని మండల పరిషత్‌ సమావేశం మందిరంలో సోమవారం బిఎల్‌ఒలు, సూపర్‌వైజర్లకు ప్రత్యేక అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల నుంచి పర్మినెంట్‌ గా వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు, మతిచెందిన వారి ఓట్లను తొలగించే విషయంలో ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన నియేను నిబంధనలకు లోబడి పారదర్శకంగా చేపట్టాలన్నారు. ముఖ్యంగా ఉపాధి కోసం మైగ్రేట్‌ అయిన వారి వివరాలు గుర్తించి వారి ఓట్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రతి బిఎల్‌ ఒ వారి వారి పరిధిలో ఇంకా ఎవరైనా 16 సంవత్సరాలు నిండి. ఓటు నమోదు చేసుకోకపోతే అటువంటి వారిని డిసెంబర్‌ 9వ తేదీ లోగా ఓటు నమోదు చేసుకునేలా తగు చొరవ తీసుకోవాలన్నారు. అదేవిధంగా 10 మందికి మించి ఒకే డోర్‌ నెంబర్లో ఓటరు నమోదై ఉంటే అటువంటి వారిని మరోసారి నిశితంగా పరిశీలించాలన్నారు. నియోజకవర్గ పరిధిలో 10 వేలు ఫారం- 6,7,8 కు సంబంధించి వరఖాస్తులు వచ్చాయని, ఆ దరఖాస్తులు నిశితంగా పరిశీలించి సకాలంలో వాటిని న్లైన్లో నమోదు చేసేలా తగు చొరవ తీసుకోవాలన్నారు. ఈ సమీక్షలో తహసీల్దార్‌ ఎం. పద్మజ ఎంపీడీఓ శ్రీహరి పలు సూచనలు చేశారు. ఈ అవగాహన సదస్సులో డిప్యూటీ తహసీల్దార్‌ ఇలియాజ్‌, సూపర్వైజర్లు, బిఎల్‌ఒలు ఉన్నారు.

➡️