Nov 25,2023 19:24
కార్పొరేషన్‌లో ఏం జరుగుతుంది..

మాట్లాడుతున్న రూప్‌కుమార్‌ యాదవ్‌
కార్పొరేషన్‌లో ఏం జరుగుతుంది..
-సమస్యలు పరిష్కరించ లేనప్పుడు సమావేశాలు లెందుకు..
?-ప్రజల్లోకి వెళ్లలేక పోతున్నాం-సమస్యలపై ధ్వజమెత్తిన వివిధ డివిజన్ల కార్పొరేటర్లు
ప్రజాశక్తి నెల్లూరు సిటీ కార్పొరేషన్‌ లో ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ప్రజల సమస్యలకు పరిష్కార మార్గం చూపడం లేదు. అధికారులకు ఫోన్‌ చేసిన స్పందించని పరిస్థితి నెలకొందని డిప్యూటీ మేయర్‌ రూపేంద్ర కుమార్‌ యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశం కార్యాలయంలోని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం మందిరంలో మేయర్‌ స్రవంతి అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్లు, వివిధ శాఖ డివిజన్ల కార్పొరేటర్లు సమస్యలపై ధ్వజమెత్తారు. కార్పొరేషన్‌ లో స్టోర్‌కు వేరే శాఖ అధికారిని నియమించడం మతల భేమిటో అర్థం కావడం లేదని డిప్యూటీ మేయర్‌ రూపేంద్ర కుమార్‌ యాదవ్‌ తెలిపారు. ప్రభుత్వం నగర అభివద్ధికి కట్టుబడి ఉందని సిఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రత్యేక దష్టి పెట్టారన్నారు. పారిశుధ్య సమస్యను పరిష్కరించేందుకు విదేశాల నుంచి ఆధునిక యంత్రాలను తెప్పిస్తున్నామన్నారు. నగర ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు పోర్టు ద్వారా పరిశ్రమలకు నీరు అందించేందుకు త్వరలో చేపడతామన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు 90 రోజులకు ఒకసారి సమావేశం నిర్వహించాలన్నారు. పారిశుధ్య కార్మికుల సిబ్బందిని పెంచేందుకు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలన్నారు. సమస్యలకు పరిష్కార మార్గం చూపించాలని, షాదీఖాన్‌ అపరిశుభ్రంగా ఉండటంతో వివాహాలు చేసుకునేందుకు రావడంలేదని డిప్యూటీ మేయర్‌ ఖలీల్‌ అహ్మద్‌ తెలిపారు. అనంతరం 14వ డివిజన్‌ కార్పొరేటర్‌ కర్తం ప్రతాప్‌ రెడ్డి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల సిబ్బంది ని పెంచాలని, డ్రెయినేజీ పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదన్నారు. ప్రజల్లో తిరిగితే తిడుతున్నారని సమస్యలు పరిష్కరించ లేనప్పుడు రాజీనామా చేయడం ఉత్తమమన్నారు. అదే కోవలో మరి కొంతమంది డివిజన్ల కార్పొరేటర్లు సమస్యలపై ధ్వజమెత్తారు. సమస్యలు తిష్టవేశాయని పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని వాటిని శుభ్రం చేసే నాధుడే లేరన్నారు. తాగునీటి సమస్య ఉందని కుళాయిలకు మురుగునీరు వస్తుందని తెలిపారు. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితి మారలేదన్నారు. వీధులలో పందుల బెడద ఉందని దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. డ్రెయినేజీ, మంచినీటి సమస్య, పారిశుద్ధ్య సమస్యతో పాటు దోమల బెడదతో నగర ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. వారానికి రెండుసార్లు అయినా దోమల నివారణకు పాగింగ్‌ చేయాలన్నారు. హిందువుల శ్మశాన వాటిక పక్కనే డంపింగ్‌ యార్డ్‌ ఉండడంవల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని ఒక్కసారి చూడాలని కోరారు. ప్రజలకు సమస్యలు తీర్చకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కరించేందుకు అధికారులు కషి చేయాలని మేయర్‌ స్రవంతి తెలిపారు..

➡️