ధర్నా చేస్తున్న కార్మికులు
కదం తొక్కిన మున్సిపల్ కార్మికులు
ప్రజాశక్తి – నెల్లూరు :
ప్రజారోగ్య పరిరక్షణ కోసం తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి కార్పొరేషన్లో పనిచేస్తున్న తమను తక్షణమే పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అందజేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. శనివారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మునిసిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని నెల్లూరు నగరపాలక సంస్థ పాలకవర్గం సమావేశంలో తీర్మానం చేయాలని కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలోకార్మికుల డిమాండ్ చేశారు. కౌన్సిల్ తీర్మానం చేసే విషయం లో నగర మేయర్ హామీ ఇవ్వకపోవడంతో కార్పొ రేషన్ ప్రధాన ద్వారం వద్ద లోపలికి వెళ్ళేం దుకు ప్రయత్నించిన మున్సిపల్ కార్మికులు ప్రయత్నిం చారు. ఈ ప్రయత్నాన్ని పోలీసులు భగం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన , సిఐటియు నాయకులు, మున్సిపల్ కార్మికులు, పోలీసు సిబ్బంది మధ్య తోపు లాటలు వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.ఈ సందర్భంగా ఎపి మున్సిపల్ వర్కర్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కత్తి శ్రీనివాసులు మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి రానున్నది తమ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మున్సిపల్ కార్మికులను ఫర్మినెంట్ చేస్తామని ఆర్బాటంగా హామీలు గుప్పించారన్నారు. మున్సిపల్ కార్మికులందరికీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం అందజేస్తామని, అసెంబ్లీ సాక్షిగా వాగ్ధానం చేశారన్నారు. అయితే రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు కావస్తున్నా ఇంతవరకు ఆ వాగ్ధానాన్ని అమలు చేయలేదన్నారు. మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్న వారిలో అత్య ధికులు దళితులు, గిరిజనులు, ఇతర బలహీన వర్గాలు లకు చెందిన వారేనన్నారు. రాష్ట్ర పభుత్వం ఎప్పటికైనా తమను పర్మినెంట్ చేయకపోతుందా అన్న ఆశతో ఎదురు చూస్తున్నారన్నారు. గత కొన్ని ఏళ్లుగా రాష్ట్రంలో ప్రభు త్వాలు మారుతున్నాయే తప్ప ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన వాగ్ధానాన్ని అమలు చేయడాన్ని విస్మరిస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఆప్కాస్ వంటి బానిస వ్యవస్థను తీసుకొని వచ్చి 60 ఏళ్లు నిండిన కార్మికులను ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుండా అర్ధాంతరంగా ఇళ్లకు పంపి వేయడం దారుణమన్నారు. మున్సిపల్ కార్మికుల పోరాటానికి మద్దతు తెలిపిన సిపిఎం, జనసేన సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ధర్నాలో రూరల్ కార్యదర్శి బత్తల కిష్టయ్య, సిఐటియు నగర కార్యదర్శి నాగేశ్వరరావు,రూరల్ కార్యదర్శి కిన్నెర కుమార్,రూరల్ అధ్యక్షులు కొండా ప్రసాద్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కే పెంచల నరసయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు అశోక్,దేశమూర్తి, సుజాతమ్మ, ఆర్.ఎం. సునీల్ భాగ్యమ్మ, కొండమ్మ,ఎం శ్రీనివాసులు,షబ్బీర్, నాగేశ్వరరావు ఉన్నారు.