హింస లేని సమాజం కోసం ఉద్యమిద్దాం

ప్రజాశక్తి -సంతనూతలపాడు : హింస లేని సమాజం కోసం ఉద్యమిద్దామని ఐద్వా జిల్లా నాయకురాలు నెరుసుల మాలతి తెలిపారు. స్థానిక జడ్‌పి హైస్కూల్‌ వద్ద ఐద్వా ఆధ్వర్యంలో అంతర్జాతీయ హింస వ్యతిరేక దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాలతి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న హింస, అత్యాచారాలు, వరకట్న హత్యలు, గహహింస, లైంగిక వేధింపులను అరికట్టాలనే లక్ష్యంతో 1999లో ఐక్యరాజ్య సమితి నవంబర్‌ 25న హింస వ్యతిరేక దినంగా ప్రకటించినట్లు తెలిపారు. మహిళలపై జరుగుతున్న హింసను, అఘాయిత్యాలను అరికట్టాల్సిన పాలకులు వాటిని పెంచి పోషించేందుకు దోహదపడటం సిగ్గుచేటని తెలిపారు. బిజెపి అధికారంలోకి వచ్చాక మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను వంటింటికి పరిమితం చేయాలనే మనుధర్మ శాస్త్రం ఆధారంగా బిజెపి పాలన సాగుతుందన్నారు. అందులో భాగంగానే ఇలాంటి అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు కె.లత, విద్యార్థినులు పాల్గొన్నారుమాట్లాడుతున్న నెరుసుల మాలతి

➡️