స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం

Nov 25,2023 21:12
ఫొటో : మాట్లాడుతున్న కావలి ఉమెన్‌ ఫోర్స్‌ కన్వీనర్‌ సి.శారద

ఫొటో : మాట్లాడుతున్న కావలి ఉమెన్‌ ఫోర్స్‌ కన్వీనర్‌ సి.శారద
స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం
ప్రజాశక్తి-కావలి : స్థానిక పెన్షనర్స్‌ భవనంలో ‘మహిళలపై హింసా వ్యతిరేక దినోత్సవాన్ని’ శనివారం పెన్షనర్స్‌ అసోసియేషన్‌, కావలి ఉమెన్‌ ఫోర్స్‌ సంయుక్తంగా ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా అసోసియేషన్‌ అధ్యక్షులు ఆకుల రమణయ్య మాట్లాడుతూ సమాజంలో పెరిగిపోతున్న మహిళలపై హింసను వ్యతిరేకించడమనే స్ఫూర్తి కలిగించాలనే లక్ష్యంతో ప్రతేడాదీ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుతారన్నారు. కావలి ఉమెన్‌ ఫోర్స్‌ కన్వీనర్‌ సి.శారద తన సభ్యులతో కలసి మహిళలు, బాలికలపై జరుగుతున్న పలురకాల హింసకు వ్యతిరేక పోరాటాలు చేస్తుంటారని తెలిపారు. కావలి ఉమెన్‌ ఫోర్స్‌ కన్వీనర్‌ సి.శారద మాట్లాడుతూ నాటి మధ్య యుగం నుండి నేటి అధునాతన యుగంలోనూ మహిళలు ఎన్ని రంగాలలో ఎంత ఎదుగుతున్నా, తమ సమర్థతను నైపుణ్యాలను నిరూపించుకుంటూ ” కాదేదీ మహిళకసాధ్యం” అని చాటుతున్నా, దేశంలో స్త్రీలు రెండవ తరగతి పౌరురాలిగానే గుర్తించబడుతుందన్నారు. మణిపూర్‌లో జరిగిన భారతమాతలపై దుశ్శాసన పర్వాలు ప్రపంచదేశాల ముందు మవదేశ ప్రతిష్టతను దెబ్బతీశాయన్నారు. గృహహింస నిరోధక చట్టం 2005 మహిళా సంఘాలు పోరాడి సాధించి తెచ్చుకున్న చట్టమని, దానిపై ప్రభుత్వం సంబంధిత శాఖ అధికారులకు, పోలీసు అధికారులకు మహిళలకు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మానవత సంఘీభావం కలిగి ప్రేక్షకపాత్రను వీడి స్త్రీలపై హింసను నాశనం చేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు ఎ.రమణయ్య, సాయిరామ్‌ సింగ్‌, ట్రెజరర్‌ వెంకటేశ్వర్లు, కార్యవర్గసభ్యులు రఘురామ్‌, కృష్ణారావు, సుకన్యకావలి ఉమెన్‌ ఫోర్స్‌ సభ్యులు సుజాత, జమున, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

➡️