ప్రజాశక్తి-ఉయ్యూరు : అంగన్వాడి కార్యకర్త ముళ్ళపూడి సౌధా రాణి కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని అంగన్వాడి జిల్లా కమిటీ కార్యదర్శి ఏ రమాదేవి అన్నారు. ఆదివారం అంగన్వాడి కంకిపాడు ప్రాజెక్టు అంగన్వాడీ కార్యకర్తల సమావేశం లో ఆమె మాట్లాడుతూ సౌదా రాణి కుటుంబానికి న్యాయం చేయాలని అంగన్వాడి కార్యకర్తలు తమ ప్రాంతాలలో చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు చదువు చెప్పడం బాలబాలికలను క్రమశిక్షణతో తయారు చేయడంలో అంగన్వాడీ వర్కర్లు కీలకపాత్ర వహిస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు అంగన్వాడీ కార్యకర్తలను చిన్నచూపు చూసి వీరికి కనీస వేతనాలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఈఎస్‌ఐ వంటి సంక్షేమ ఫలాలు అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందారని ఆరోపించారు. సౌదా రాణి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని కోరారు. అంగన్వాడీ వర్కర్స్ నాయకులు కనకరత్నం ఇందిరా, పద్మ సౌభాగ్యం భారతి జిల్లా సిఐటియు నాయకులు చౌటుపల్లి రవిబాబు మండల కార్యదర్శిలు త్రిమూర్తులు, తాడంకి నరేష్, సజ్జ బాల గంగాధర్, జిల్లా కమిటీ సభ్యులు బి రాజేష్, బి కీర్తి తదితరులు పాల్గొన్నారు.