సెక్టోరల్‌ అధికారులదే కీలక పాత్ర

ప్రజాశక్తి-రాయచోటి ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్‌ అధికారులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని కలెక్టర్‌ గిరీష సెక్టోరియల్‌ అధికారులకు సూచించారు. మంగళ వారం పట్టణంలోని నారాయణ కల్యాణ మండపంలో ఎస్‌పి కృష్ణారావుతో కలిసి వచ్చే సాధారణ ఎన్నికల నిర్వహణపై సెక్టార్‌ ఆఫీసర్లు, పోలీస్‌ సెక్టార్‌ అధికా రులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సెక్టార్‌ అధికారులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశాన్ని సీరియస్గా తీసుకొని పనిచేయాల న్నారు. ఎన్నికలు జరిగే సమయంలోఎక్కడ ఏమి జరిగినా వెంటనే ఇన్సిడెంట్‌ రిపోర్టు తమకు పంపాలని పేర్కొన్నారు. అబ్జర్వర్‌లకు కూడా మీరే అన్ని వివ రాలు తెలియజేయాల్సి ఉంటుందని తెలిపారు. పోలింగ్‌ పూర్తయి బ్యాలెట్‌ బాక్సులు స్ట్రాంగ్‌ రూమ్‌ వరకు తీసుకొచ్చే పూర్తి బాధ్యత మీరే తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం సెక్టోరియల్‌ అధికారులకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి, పోలింగ్‌ కేంద్రాలహొ వద్ద ర్యాంపు, వీల్‌ చైర్స్‌, విద్యుత్‌, తాగునీరు మరుగుదొడ్లు, వెబ్‌ క్యాసిటింగ్‌ చేయుటకు అవసరమైన విద్యుత్‌ సౌకర్యాలు ఉన్నాయా, లేవని పరిశీలించి ఆ రిపోర్టును కలెక్టర్‌ కార్యలయానికిహొ అందజేయాలని పేర్కొన్నారు. వల్నరబిలిటి, క్రిటికల్‌, సెన్సిటివ్‌, హైపర్‌ సెన్సిటివ్‌ పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి వెంటనే తమకు రిపోర్టు పంపాలన్నారు. సెక్టోరల్‌ అధికారులు ప్రణాళికాబద్ధంగా అన్ని ముందస్తు ఏర్పాట్లు చూసుకొనిహొ మీకు కేటాయించిన రూటు, పోలింగ్‌ స్టేషన్‌ లను ముందస్తుగా పరిశీలిం చాలన్నారు. ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు స్వేఛ వాతావరణం కల్పించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్లు చూడాలన్నారు. రూట్‌ మ్యాపు సెక్టార్‌ మ్యాపు మీ సంబంధిత తహసిల్దార్‌ తో సంప్రదించి తయారు చేసుకో వాలన్నారు. పోలింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత పి ఓ,డైరీ,బ్యాలెట్‌ పేపర్స్‌ అకౌంట్‌ అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా పరిశీలించి రిసెప్షన్‌ కేంద్రంలో అందజేయాలన్నారు. పిఒలు, ఎపిఒలకుహొ సంబంధించిన ఫోన్‌ నెంబర్లను సెక్టోరియల్‌ అధికారుల వద్ద ఉంచుకోవాలన్నారు. జిల్లాలో 1607 పోలింగ్‌ కేంద్రాలు, 620 మంది సెక్టార్‌ అధికారులు పనిచేయడం జరుగుతుందని వీరం దరూ తమకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఎస్‌పి కృష్ణారావు మాట్లాడుతూ పోలీస్‌ సెక్టార్‌ అధి కారులు పోలింగ్‌ కేంద్రాలలో సౌకర్యాలు పక్కాగా ఉండేటట్లు చూడాలన్నారు. సెక్టర్‌ అధికారులకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహిస్తే ఎన్నికలను విజయవంతం చేయవచ్చునని ఇప్పటి నుంచే మీకు కేటాయించిన ప్రతి పోలింగ్‌ స్టేషన్ను విసిట్‌ చేసి అక్కడ ఉండాల్సిన కనీస వసతులు ఉండేటట్లు చూడాల న్నారు. పోలింగ్‌ కేంద్రాలలో ఎటువంటి సమస్యలున్నా వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయగలరు. ఈ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికలలో ఓటు వేసే ఓటర్లు ఓటర్‌ స్లిప్‌తో పాటు రేషన్‌ కార్డు, ఓటర్‌ కార్డు, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, పోస్‌ పోర్టు, ఎంప్లారు ఐడి కార్డు, ఏదైనా ఒకటి గుర్తింపు కార్డుతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేటట్లుచూడాలని పేర్కొన్నారు. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లకు స్వేచ్ఛవాతావరణం కల్పించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు కషి చేయాలని తెలిపారు. ఓటర్లపై అధికంగా ప్రభావం చూపే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి నివేదిక ఇవ్వాలన్నారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో జరిగిన సంఘటనలు, బైండోవర్‌ వివరాలను గుర్తించి ఈసారి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు.

➡️