ప్రజాశక్తి – దేవరపల్లి
విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు బాలోత్స వాలు ఎంతగానో దోహదం చేస్తాయని ఎంపిపి కుప్పల వెంకట కనక దుర్గారావు అన్నారు. దేవరపల్లి రెండవ బాలోత్సవం గోడ పత్రికను ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరపల్లి మండల లోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్ విద్యార్థులు బాలోత్సవాల్లో పాల్గొని తమలో ఉన్న నైపుణ్యతను చాటిచెప్పాలన్నారు. మండల బాలోత్సవ కమిటీ అధ్యక్షులు బలుసు సత్యనారాయణ మాట్లాడుతూ దేవరపల్లి మండల బాలోత్సవ కార్యక్రమం డిసెంబర్ 13వ తేదీన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవ కమిటీ సభ్యులు వి.కృష్ణారావు, ఎ.సుభాష్ చంద్రబోస్, కె.సత్యనారాయణ, ఎన్.రామారావు పాల్గొన్నారు.