చెక్కులు అందజేస్తున్న ఎంఎల్‌ఎ
సిఎం సహాయ నిధి చెక్కులు అందజేత
ప్రజాశక్తి-కందుకూరు : అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పనలో భాగంగా పట్టణ పరిధిలోని శామీరపాలెం గ్రామానికి చెందిన ముప్పరాజు సుభాని కుటుంబానికి సిఎం సహాయనిధి ద్వారా రూ 5,00,000 చెక్కును ఎంఎల్‌ఎ ఎం మహీధర్ రెడ్డి చేతుల మీదగా ఆదివారం లబ్ధిదారునికి అందజేశారు. ఈ సందర్భంగా సుభాని మాట్లాడుతూ అనారోగ్యం భారీన పడటంతో వైద్య ఖర్చులు నిమిత్తం సిఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. తమ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఎంఎల్‌ఎ మహీధర్ రెడ్డి కి ఆర్థిక సహాయం చేసినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
