‘సర్వారాయ’ ఎన్నికల్లో సిఐటియు ఘనవిజయం

సిఐటియు

ప్రజాశక్తి-కడియంవేమగిరిలోని సర్వారాయ సుగర్స్‌ బాట్లింగ్‌ యూనిట్‌ (కోకోకోలా)లో గురువారం గుర్తింపు సంఘం ఎన్నికల్లో శ్రీసర్వారాయ సుగర్స్‌ లిమిటెడ్‌ బాట్లింగ్‌ యూనిట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) సంఘం విజయం సాధించింది. మొత్తం ఓట్లు 141కు గాను 134 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో సిఐటియుకు 86, ఎఐటియుసికి 48 ఓట్లు వచ్చాయి. 38 ఓట్ల ఆధిక్యతతో ఎఐటియుసిపై సిఐటియు విజయం సాధించింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం 2 గంటలు వరకు జరిగింది. అనంతరం 3.30 గంటలకు ఫలితాలు వెల్లడించారు. ఫలితాల అనంతరం జరిగిన విజయోత్సవ సభలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.అరుణ్‌, ఎస్‌ఎస్‌.మూర్తి మాట్లాడారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిఐటియును గెలిపించిన కార్మికులకు అభినందనలు తెలిపారు. కార్మికులకు మెరుగైన వేతనఒప్పందం, ఇతర సమస్యలు పరిష్కారానికి సిఐటియు కృషి చేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై అన్ని పరిశ్రమల్లోని కార్మికులను ఏకం చేసి కార్మిక సంక్షేమానికి కృషి చేస్తుందని, అదే తరుణంలో ప్రభుత్వ విధానాల వల్ల చితికి పోతున్న చిన్న మధ్య తరగతి పరిశ్రమలు రక్షణకు పోరాటాలు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.సుందబాబు, బి.రాజులోవ, జిల్లా కోశాధికారి కెఎస్‌వి.రామచంద్రరావు, జిల్లా కార్యదర్శులు కర్రి రామకృష్ణ, బి.పూర్ణిమరాజు, కె.బేబిరాణి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌.మచ్చరావు, బి.పవన్‌, యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు పలివెల భాస్కరరావు, అల్లుమిల్లి శ్రీనివాసు, కెవివి.సత్యనారాయణ, కమిటీ సభ్యులు వైట్ల శ్రీధర్‌, బిఎన్‌ఎం.రాజు, ఎస్‌జివి.సత్యనారాయణ, వై.కోటేశ్వరరావు, సిహెచ్‌.మల్లేశ్వరరావు, కె.సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

➡️