సమస్యలపై విశ్రాంత ఉద్యోగుల వినతి

అసోసియేషన్‌

ప్రజాశక్తి-కాకినాడరాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని అసోసియేషన్‌ నాయకులు కె.పద్మనాభం, ఎస్‌.ఇబ్రహీం, హెచ్‌సి.సుబ్రహ్మణ్యం, శాస్త్రి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం కాకినాడ సిటీ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి వారు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రికి సిఫార్సు చేయాలని, ప్రతినెలా 1వ తేదీన పింఛను చెల్లించాలని, అడిషనల్‌ క్వాంటంను పాత పద్ధతిలో కొన సాగించాలని, ఇహెచ్‌ఎస్‌ కార్డుపై పూర్తిస్థాయిలో అన్ని వ్యాధులకు వైద్య సదుపాయం అందేలా, మెడికల్‌ క్లెయిమ్‌ పెంచాలని, డి.ఆర్‌ బకాయిలు, బకాయి పడిన డిఆర్‌ మంజూరు చేయించడానికి కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

➡️