ప్రజాశక్తి -తగరపువలస : సమస్యలపై ఐక్యంగా పోరాడాలని ఐద్వా జిల్లా అధ్యక్షులు బి.పద్మ మహిళలకు పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో శుక్ర వారం ఐద్వా భీమిలి జోన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మహిళా బిల్లును ముందుకు తీసుకొచ్చింది తప్పితే మహిళల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్త శుద్ధి లేదన్నారు. మహిళపై వివిధ రూపాల్లో దాడులు పెరుగుతున్నాయని, వీటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారుభీమిలి జోన్ నూతన కమిటీ ఎన్నిక ఐద్వా భీమిలి జోన్ నూతన కమిటీని శుక్రవారం సిఐటియు కార్యాలయంలో ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎస్.గున్నమ్మ, ప్రధాన కార్యదర్శిగా కె.నాగరాణి, సభ్యులుగా జి.లక్ష్మి, పి.రమణమ్మ, సిహెచ్.లావణ్య, యు.నూకరత్నం, ఎన్.వెంకయ్యమ్మ, ఎస్.చిన్ని, మాధవి ఎన్నికయ్యారు.