సచివాలయ భవనం ప్రారంభం

సచివాలయ భవనం ప్రారంభం

 ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 14వ వార్డు పరిధి నరసింహనగర్‌-1లో రూ.35.32 లక్షలతో నిర్మించిన సచివాలయ నూతనభవనాన్ని మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి ప్రారంభించారు. సచివాలయం పైన రూ.20 లక్షలతో అదనపు అంతస్తుగా సామాజిక భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 14వ వార్డు కార్పొరేటర్‌ కె.అనిల్‌ కుమార్‌రాజు ఆధ్వర్యాన నిర్వహించిన కార్యక్రమంలో మేయర్‌ మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్లు లాంటివన్నారు. ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు మాట్లాడుతూ, ప్రజలకు అన్ని విధాలా మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. స్థానిక ప్రజల సమస్య మేరకు సామాజిక భవనం నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి చొక్కాకుల వెంకటరావు, డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ అల్లు శంకరరావు, కార్పొరేటర్లు వి.ప్రసాద్‌, రెయ్యి వెంకటరమణ, కో-ఆప్షన్‌ సభ్యులు సేనాపతి అప్పారావు, జోనల్‌ కమిషనర్‌ విజయలక్ష్మి, నాయకులు కెవి.బాబా, జివి.రమణి, కృష్ణారావు మాస్టర్‌, బల్లా శ్రీనివాసరావు, లంకా భాస్కరరావు, టిఎస్‌ఎన్‌.మూర్తి, చొక్కాకుల రామకృష్ణ, ఇఇ రత్నాకర్‌రెడ్డి, డిఇ శ్రీనివాస్‌, ఎఇ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️