ప్రజాశక్తి – కడపప్రతినిధిసకాలంలో సచివాలయ నిర్మాణాలను పూర్తి చేస్తాం. ఆర్‌బికె, వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్స్, పాడా నిధులతో పాల సేకరణ కేంద్రాలు, అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీ నిధులతో మౌలిక వసతుల కల్పనలో గణనీయమైన పురోగతి సాధించాం. 2023 డిసెంబర్ నుంచి మార్చి నాటికి మౌలిక వసతుల కల్పనను పూర్తి చేయడమే లక్ష్యం. వీటితోపాటు జిల్లాలోని వేంపల్లి బ్రిడ్జిల నిర్మాణ పనులు ముగింపు దశలో ఉంది. సిరిగేపల్లి బ్రిడ్జి నిర్మాణానికి గండికోట బ్యాక్‌వాటర్ ముంపు సమస్య కారణంగా నిలిచి పోయింది. బ్యాక్ వాటర్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పురోగతిపై ఆలోచన చేయాల్సి అవసరం ఏర్పడనుంది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెరుగైన వసతుల కల్పనపై దృష్టి సారించామని పేర్కొంటున్న పంచాయతీరాజ్ సూపరింటెండింగ్ ఇంజినీర్ జి.వి. శ్రీనివాసులరెడ్డితో ముఖాముఖి…వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్ ప్రోగ్రెస్ ఎలా ఉంది? రూ.48 కోట్లతో 343 వైఎస్‌ఆర్ హెల్త్‌క్లినిక్స్ నిర్మాణాలను చేపట్టాం. ఇందులో దాదాపు హెల్త్‌క్లినిక్స్ భవన నిర్మాణ పనులు ముగింపు దశలో ఉన్నాయి. ఈయేడాది డిసెంబర్, మార్చి మాసాల మధ్య నాటికి మిగిలిన నిర్మాణాలను పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకెళ్తున్నాం.సచివాలయ భవన పురోగతి చెప్పండి? జిల్లాలో రూ.158 కోట్లతో 426 సచివాలయ నిర్మాణ పనులు చేప ట్టాం. 303పైగా భవన నిర్మాణ పనులు పూర్తి చేశాం. సుమారు 81 శాతం మేర పురోగతి సాధించాం. మిగిలిన 123 సచివాలయ నిర్మాణ పనులను డిసెంబర్, మాసాల నెలాఖరు నాటికి పూర్తి చేయడంపై దృష్టి సారించాం.ఆర్‌బికెల స్థితిగతులేమిటి? రూ.75 కోట్లతో 417 రైతు భరోసా కేం ద్రాల నిర్మాణ పనులు చేపట్టాం. ఇందులో 210పైగా రైతు భరోసా కేంద్రాల నిర్మాణ పనుల్ని పూర్తి చేశాం. ఇప్పటికి 70 శాతం పనులు చేపట్టాం. డిసెంబర్, మార్చి మాసాల నాటికి అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం.పాడా పనుల గురించి తెలపండి? పులివెందుల ఏరియా అథారిటీ డెవలప్‌మెంట్ కింద పంచాయతీరాజ్ పరిధిలో రూ.210 కోట్లతో 1470 పనులు చేపడుతున్నాం. ఇందులో 569 సిసిరోడ్లు, కల్వర్టులు తదితర పనులు పూర్తి చేశాం.సిరిగేపల్లి బ్రిడ్జి ప్రశ్నార్థకమేనా? కొండాపురం-సిరిగేపల్లి బ్రిడ్జి పనులు తా త్కాలికంగా నిలిపేశాం. గండి కోట జలాశయం బ్యాక్‌వాటర్ కారణంగా పురోగతి లేదు. వెనుక జలాలు తగ్గిన వెంటనే పనులను వేగవంతం చేస్తాం.వేంపల్లి బ్రిడ్జి నిర్మాణ పనుల గురించి తెలపండి? వేంపల్లి బ్రిడ్జి నిర్మాణం ముగింపు దశకు చేరుకుంది. గతేడాది పాపాఘ్ని నదికి వచ్చిన వరదల కారణంగా బ్రిడ్జి శ్లాబ్ మూత పనుల్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఈయేడాది మార్చి నాటికి పనుల్ని పూర్తి చేయడంపై దృష్టి సారించాం.