మాట్లాడుతున్న కలెక్టర్
సంపూర్ణ ఓటరు జాబితాకు కృషి : కలెక్టర్
ప్రజాశక్తి -నెల్లూరు ఓటరు జాబితాలో నూరు శాతం అర్హులైన ఓటర్లు నమోదైవుండాలనే లక్ష్యంతో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి కషిచేస్తున్నట్లు కలెక్టర్ ఎం హరి నారాయణన్ తెలిపారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఓటరు జాబితా పునశ్చరణ, ఎన్నికల ఇతర సంబంధిత అంశాలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ హరినారాయణన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో నూరుశాతం అర్హులైన ఓటర్లు నమోదైవుండాలనే లక్ష్యంతో ఇసి ఆదేశాల పాటిస్తూ జిల్లాలో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి కషి చేస్తున్నట్లు తెలిపారు. గత నెల అక్టోబర్, 27న సమీకత ముసాయిదా ఓటర్ల జాబితా వెల్లడించినట్లు తెలిపారు. అక్టోబరు 27 నుంచి డిసెంబర్ 9 వ తేదీ వరకు స్వీకరించిన అభ్యంతరాలను డిసెంబర్ 26వ తేదీ నాటికి పారదర్శకంగా పరిశీలించి పరిష్క రిస్తామన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో డిసెంబర్, 2, 3 తేదీల్లో స్పెషల్ కాంపెయిన్ నిర్వహించి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. కొన్ని రాజకీయ పార్టీల వారు మాత్రమే బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకున్నారని, మిగిలిన రాజకీయ పార్టీల వారు కూడా జిల్లాలోని అన్నీ నియోజక వర్గాల్లో బూత్ లెవెల్ ఏజెంట్స్ ను పూర్తిస్థాయిలో నియ మించుకోవాలని కోరారు. కలెక్టర్, రాజకీయ పార్టీ ప్రతినిధులకు సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, వైసిపి ప్రతినిధులు సురేంద్ర బాబు, టిడిపి ప్రతినిధులు చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, బిజెపి ప్రతినిధులు రాజేష్, బిఎస్‌పి ప్రతినిధులు శ్రీరాం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతినిధులు బాలసుధాకర్ ఉన్నారు.