సంతగుడిపాడులో త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా పనులు

 రొంపిచర్ల: మండలంలోని సంతగుడిపాడులో 24 గంటల త్రీఫేస్‌ విద్యుత్‌ సరఫరా కోసం రూ. 90 లక్షలతో బుధవారం పనులు ప్రారంభించారు. గ్రామంలో మొత్తం 90 లక్ష రూపాయలతో 11 కె.వి నూతన లైన్‌ 4 కెఎ, 50 కెఎం, మేరకు ఎల్‌టి లైన్‌, 300 నూతన విద్యుత్‌ స్తం భాలు 24 గంటల త్రీఫేస్‌ విద్యుత్‌ సరఫరా పనులను గ్రామ పెద్ద లతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీని వాస్‌రెడ్డి ప్రారంభించారు. అదే విధంగా ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్య క్రమంలో భాగంగా వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందించిన వివరాలు తెలిపే డిస్‌ ప్లే బోర్డును ఆయన ఆవిష్కరించారు. ఈ గ్రామంలో రూ.30 కోట్లతో అభివృద్ధి,సంక్షేమం ప్రజలకు అందజేశామని తెలిపారు. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విద్య, వైద్య, వ్యవసాయ, విద్యుత్‌ రంగాల్లో వినూత్న సంస్కర ణలను చేపట్టామని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు మన రాష్ట్రం లోనే అమలవుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో విద్యుత్‌ శాఖాధి కారులు డిఈ, ఏడీలు, ఏఈలు, మండల మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ బత్తుల రామకృష్ణ, సర్పంచ్‌ ఉయ్యాల సీతమ్మ పాల్గొన్నారు.

➡️