ప్రజాశక్తి – సామర్లకోట రూరల్
నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగిస్తున్న వైసిపి ప్రభుత్వానికి అండగా నిలవాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ దవులూరి దొరబాబు కోరారు. మండలంలోని ఉండూరులో రూ. 1.70 కోట్లతో నిర్మించిన సచివాలయం, వెల్నెస్ సెంటర్, ఆర్‌బికెల సముదాయాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ టిడిపి పాలనలో ప్రభుత్వ పథకాలు అందని ద్రాక్షాగా ఉండేవని, ప్రస్తుత ప్రభుత్వంలో వాలంటీర్, సచివాలయం వ్యవస్థల ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు వస్తున్నాయని తెలిపారు. గ్రామానికి వచ్చిన దొరబాబుకు గ్రామ సర్పంచి సత్యాడి ధనలక్ష్మి సత్యనారాయణ, ఉప సర్పంచి కొప్పిరెడ్డి రాధాకృష్ణల ఆధ్వర్యంలో ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ డి.శ్రీలలిత, ఇఒపిఆర్‌డి సత్యరెడ్డి, వైసిపి నాయకులు ఎలిశెట్టి నరేష్, తలారి దొరబాబు, తాటికొండ అచ్చిరాజు, గ్రామ కార్యదర్శి తోట సత్యనారాయణ, పాల్గొన్నారు.