సంక్షేమ పథకాలను వినియోగించుకోండి

Nov 27,2023 00:31 #jc, #palanadu, #syamprasad

పల్నాడు జిల్లా : కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వి నియోగం చేసుకుంటూ అభివృద్ధి బాటలో పయనించాలని జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ అన్నారు. కేంద్ర నుంచి వచ్చిన వికసిత్‌ సంకల్ప యాత్ర వాహనాన్ని రిబ్బన్‌ కత్తి రించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ వాహనంలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడి స్క్రీన్‌, అందులో ప్రసారమవు తున్న 7.5 నిమిషాల నిడివి గల లఘు చిత్రాలను ఆయన పరిశీలించారు. ప్రజల జీవితాలలో మార్పు తీసుకురావ డానికే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. గ్రామాల్లో ప్రజలను చైతన్య పరచ డానికి కేంద్ర ప్రభుత్వంఈ యాత్రను చేపటనట్లు చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ వరకు జిల్లాలోని 527 పంచాయతీలలో ఈ యాత్ర సాగు తుం దన్నారు. ఇందుకోసం జిల్లాకు 4 వాహనాలు కేంద్రం నుంచి వచ్చా యని, ప్రతిరోజు నాలుగు రూట్‌ లలో వాహనాలు పర్య టించేలా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆయా పద ¸కాల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. పక్కా గృహాల నిర్మాణం, ఇంటింటికి కుళాయి కనెక్షన్‌తో తాగనీరు వంటి 17 రకాల పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కార్య క్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం జిల్లా ఉద్యానవన శాఖాధికారి బెన్నీ పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమం ప్రారంభంజిల్లాలో నిర్వహించ తలపెట్టిన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో భాగంగా ఐఇఎస్‌ వాహనాల ప్రచార కార్యక్రమాన్ని స్థానిక నరసరావుపేట లింగంగుంట్ల గ్రామ పంచాయతి కార్యాలయం నుండి ఆదివారం లాంఛ నంగా ప్రారంభించారు. ప్రతిజ్ఞ అనంతరం దృశ్య శ్రవణ మాధ్యమికం ద్వారా ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రసారం చేశారు. ఈ సందర్భంగా డ్రోన్‌ వినియోగాన్ని ప్రత్యక్షంగా ప్రయోగత్మకంగా చూపించారు. ఈ సందర్భంగా పలు వురు లబ్ధిదారులకు భూసార పరీక్ష పత్రాలను అంద జేశారు.ఐసిడిఎస్‌, సేంద్రీయ వ్యవసాయం, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాల అమలుపై స్టాల్స్‌ ఏర్పాటు చేసి ప్రజల అవగాహన కల్పించారు అనంతరం మాజీ సైనిక ఉద్యోగి ఉరియా ఏడుకొండలు, అంత ర్జాతీయ సాఫ్ట్‌బాల్‌ క్రీడాకారుడు ఎం.హరిప్రియ, సీనియర్‌ సిటిజన్‌ ఎన్‌.సత్యనారాయణరెడ్డి ని సత్కరిం చారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అబివృద్ధి సంక్షేమ పథకాలపై కరపత్రాలు క్యాలెం డర్లు, బుక్‌లెట్లను అందజేశారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ కె.వినాయకం, వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర జిల్లా కోఆర్డినేటర్లు బెన్నీ, భాస్కర్‌ రెడ్డి, సేంద్రియ వ్యవ సాయ అధికారి అమలకుమారి, ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ అధికారి అరుణ, జిల్లా వ్యవసాయ శాఖాధికారి మురళి, సచివాలయ పంచాయతి సెక్రెటరీ ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️