ప్రజాశక్తి- పుల్లలచెరువు : అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రాన్ని సిఎం జగన్ ఆదర్శంగా నిలిపారని ఎంపిపి కందుల వెంకటయ్య, వైసిపి మండల కన్వీనర్ బివి.సుబ్బారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని గంగవరం సచివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్‌కు సిఎం జగన్ ఎందుకు కావాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. సచివాలయం పరిధిలో మొత్తం రూ.4.70 కోట్ల మేర ప్రజలకు లబ్ధిచేకూరినట్లు వివరించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి ఇంటింటికి తిరిగి నవరత్నాలు, మా నమ్మకం నువ్వే జగన్, వై ఏపీ నీడ్స్ జగన్ బుక్ లెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇఒఆర్‌డి శరత్ బాబు, సచివాలయాల కన్వీనర్ దోమకాల వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, గంగవరం సర్పంచి పాలగిరి నారాయణమ్మ, వైస్ ఎంపిపి కోట్ల నరసమ్మ, ఎంపిటిసి లింగంగుంట్ల రాములు, నాయకులు ఆవుల కోటిరెడ్డి, రఘు, వేముల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పెద్దదోర్నాల : మండల పరిధిలోని యడవల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్‌కు జగనే ముఖ్యమంత్రి ఎందుకు కావాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి మండల కన్వీనర్ గంటా వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మంచి పాలన అందించిన జగన్మోహన్‌రెడ్డిని తిరిగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయని వివరించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంటావానిపల్లి సర్పంచి యక్కంటి వెంకటేశ్వరరెడ్డి, నాయకులు వెన్నా పాండు రంగారెడ్డి, చిట్టేల శ్రీరాములు, కృష్ణారెడ్డి, ఒంటేరు నాగేశ్వరరావు, లాలూ నాయక్, వెంకటేశ్వరరెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ గుండారెడ్డి రమణారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, వెన్నా కాశిరెడ్డి పాల్గొన్నారు . కొండపి : మండల పరిధిలోని గోగినేనివారిపాలెంలో రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి నాయకుడు చింతల సుబ్బారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసినట్లు తెలిపారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి, ఇఒపిఆర్‌డి వై.వేణు, పంచాయతీ సెక్రటరి సునీత,వాలంటీర్లు పాల్గొన్నారు. కొమరోలు : మండల పరిధిలోని రెడ్డిచర్ల గ్రామంలో ఎంపిపి కామూరి అమూల్య ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. అనంతరం జెండాను ఆవిష్కరించి ఇంటింటికీ వెళ్లి కరత్రాలు పంపిణీ చేశారు. 2024 ఎన్నికలలో మళ్లీ వైసిపిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసిలు శ్రీనివాసరెడ్డి, నిర్మల, సర్పంచి ఉమాదేవి, వైస్ సర్పంచి శేషు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.