సంక్షేమం,అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం

వాకలగరువు, జగన్మోహన్‌రెడ్డి

ప్రజాశక్తి – అంబాజీపేట
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధితో కూడిన పాలన సిఎం వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యమని అంబాజీపేట సొసైటీ చైర్మన్‌ దొమ్మేటి సత్యమోహన్‌ అన్నారు. వాకలగరువు పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం సర్పంచ్‌ మద్దిశెట్టి సుబ్బారావు(దొరబాబు) అధ్యక్షతన ‘ఎపికి జగన్‌ ఎందుకు కావాలి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నాలుగున్నర ఏళ్లుగా జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమం పథకాలు తెలిపే డిజిటల్‌ బోర్డును సర్పంచ్‌ ఆవిష్కరించారు.  మండల అధ్యక్షులు వాసంశెట్టి చినబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జగన్‌కు అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు వాకపల్లి కాశీ విశ్వనాథం(దొరబాబు), గ్రామశాఖ మాజీ అధ్యక్షులు వాకపల్లి శ్రీనివాసరావు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ కడలి సుబ్రహ్మణ్యం, వైసిపి బూత్‌ కన్వీనర్‌ చప్పిడి రాజు, వార్డు సభ్యులు ఎస్‌.శ్రీనివాసరావు, వి.రాంబాబు, ఎస్‌.శ్రీనివాసరావు, వైసిపి నాయకులు ఎన్‌.శ్రీను, కె.దుర్గాప్రసాద్‌, జి.శ్రీనివాస్‌, పి.కొండలరావు, పంచాయతీ కార్యదర్శి డి.లక్ష్మీపతి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️