ప్రజాశక్తి – కలిదిండి
వైసిపి నియోజకవర్గ నాయకులు పోసిన చెంచు రామారావుకు పితృవియోగం కలిగింది. పోసిన చెంచు రామారావు తండ్రి పోసిన బ్రహ్మయ్య శాస్త్రులు(90) అనారోగ్యానికి బుధవారం గురై మరణించారు. ఆయన స్వగ్రామం మండలంలోని గుర్వాయిపాలెం కాగా గత కొన్ని ఏళ్లుగా కలిదిండిలో స్థిరపడ్డారు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండేవారు. ఆయన భార్య గత ఎనిమిదేళ్ల క్రితం అస్వస్థకు గురై మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా ఇటీవలే చిన్న కుమారుడు ఆంజనేయులు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన చిన్ననాటి నుంచి కమ్యూనిస్ట్ నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. ఆ భావాలతో గ్రామ అభివృద్ధిలో, యువత క్రీడల పట్ల మక్కువ చూపడంలో శ్రద్ధ చూపేవారు. కలిదిండిలో ఆయన స్వగృహం వద్ద బ్రహ్మయ్య శాస్త్రులు భౌతిక కాయాన్ని పలువురు గ్రామ ప్రముఖులు సందర్శించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.