ప్రజాశక్తి-మార్కాపురం: రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టాలని, టిడిపి ఆదరించాలని టిడిపి మార్కాపురం నియోజకవర్గ పోల్మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్‌ఛార్జి కందుల రామిరెడ్డి తెలిపారు. 19వ వార్డులో బాబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల రామిరెడ్డి మాట్లాడారు. ప్రజలపై భారాలు మోపడంలో సిఎం జగన్మోహన్రెడ్డి దేశంలో నెంబర్‌వన్‌గా నిలిచారన్నారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, జైలులో ఉంచడం సిఎం జగన్ పనిగా పెట్టుకున్నారన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలు, వాటి ప్రయోజనాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమానికి వార్డు ఇన్‌ఛార్జి, మార్కాపురం పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు, డి.మస్తానయ్య, ఇబ్రహీంఖాన్, గులాబ్‌ఖాన్, జాన్ డేవిడ్ పాల్గొన్నారు. కొండపి : రాష్ట్రంలో వైసిపి అరాచకాలు, ఆగడాలకు అంతేకుండా పోతోందని ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి ధ్వజ మెత్తారు. మండల పరిధిలోని ఇలవర గ్రామంలో టిడిపి మండల అధ్యక్షుడు బి.మలమందనాయుడు ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిటనీ చేశారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేసే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో వైసిపి ఓటమి భయం పట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి మాజీ చైర్మన్ జి.రామయ్యచౌదరి, బత్తుల నారాయణ స్వామి, వసంతరావు, నరసారెడ్డి, టి.కృష్ణారెడ్డి, యనమద్ని వెంకటేశ్వర్లు, చింతల వెంకటరావు, సుబ్బరామయ్య, బి.సోమయ్య, టిడిపి యూత్ మండల అధ్యక్షుడు కాలేషా, మహిళా అధ్యక్షురాలు బి.ప్రసన్నలక్ష్మి, మాజీ ఎంపిపి దేపూరి రత్తమ్మ, నేతి రవికుమార్, మస్తాన్, వసంత్ తదితరులు పాల్గొన్నారు.