వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా…తల్లుల ఖాతాల్లో రూ.4.42 కోట్లు జమ

Nov 23,2023 22:07
వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా...తల్లుల ఖాతాల్లో రూ.4.42 కోట్లు జమ

వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా…తల్లుల ఖాతాల్లో రూ.4.42 కోట్లు జమప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ జూలై 2023 -సెప్టెంబర్‌ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 మంది లబ్ధిదారులకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కింద రూ. 81.64 కోట్ల ఆర్ధిక సాయాన్ని గురువారం ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం, తాడేపల్లి నుండి వర్చువల్‌ విధానంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి అర్హులైన లబ్దిదారుల తల్లుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జమ చేశారు. తిరుపతి జిల్లా ఆర్డీఓ తిరుపతి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి కలెక్టర్‌ కే వెంకట రమణారెడ్డి సంబంధిత అధికారులు, లబ్దిదారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వైయస్సార్‌ కళ్యాణమస్తు, వై.యస్‌.ఆర్‌ షాది తోఫా కింద 535 మంది లబ్ధిదారులకు సుమారు రూ.4.42 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్‌ వ్యవస్ధ ద్వారా అత్యంత పారదర్శకంగా వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా ల కింద అర్హులైన లబ్దిదారుల ఎంపిక జరుగుతోందని అన్నారు. జిల్లాలో లబ్ది పొందిన వారిలో బిసి కులానికి చెందిన విభిన్న ప్రతిభావంతులకు నలుగురికి రూ.6లక్షలు, బిసి కులాంతర వివాహ లబ్ధిదారులు 13 మందికి 10.20 లక్షలు, బి సి కులానికి చెందిన 225 మందికి 1.30 కోట్లు, ఎస్సీ విభిన్న ప్రతిభావంతులు వివాహ లబ్ధిదారులకు ఒకరికి 1.50 లక్షలు, ఎస్సీ కులాంతర వివాహ లబ్ధిదారులకు 12 మందికి. రూ.14.40 లక్షలు, ఎస్సీ లబ్ధిదారులకు 251 మందికి 2.51 కోట్లు, ఎస్టీ లబ్ధిదారులకు 23 మందికి 23 లక్షలు, ఎస్టీ కులాంతర వివాహ లబ్ధిదారులకు ఒక్కరికీ 1.20 లక్షలు, ఓసి లబ్ధిదారులు 5 మందికి 5 లక్షలు లబ్ది వెరసి మొత్తం జిల్లాలో 535 మంది లబ్ధిదారులకు సుమారు 442.30 లక్షలు లబ్ది పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పథక సంచాలకులు డి ఆర్‌ డి ఏ జ్యోతి, జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ సాధికార ఇంఛార్జి అధికారి భాస్కర్‌ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సూర్యనారాయణ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు, డిఆర్డిఎ, మెప్మ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.మెగా చెక్కును అందిస్తున్న కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి

➡️