వేగాయమ్మ పేటలో ‘పల్లెకు పోదాం’

పథకాల డిస్‌ప్లేబోర్డు ప్రారంభించిన ఎంపిపి భవాని

ప్రజాశక్తి-రామచంద్రపురం

వైసిపి ప్రభుత్వం చేపట్టిన ‘పల్లెకు పోదాం’ కార్యక్రమం శుక్రవారం వేగాయమ్మ పేట గ్రామ సచివాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల పరిషత్‌ అధ్యక్షులు అంబటి భవాని మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని అన్నారు.అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న ఏకైక సిఎం జగన్‌ అనికొనియాడారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్‌ అంబటి తుకారాం అధ్యక్షత వహించారు. మండల కన్వీనర్‌ పలివెల నాగరాజు కార్యక్రమం గురించి వివరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శిలు సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, గృహసారథులు గ్రామస్తులు పాల్గొన్నారు.

 

➡️