వీవోఏలకు హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలి
యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి డిమాండ్
ప్రజాశక్తి` చిత్తూరుఅర్బన్:
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27వేల మంది వీవోఏలకు హెచ్‌ఆర్ పాలసీ, కనీస వేతనాలు అమలు చేయాలని ఏపీ ఐకెపి వెలుగు యానిమేటర్ ఉద్యోగుల సంఘం (సిఐటియు) మూడు జిల్లాల సమావేశం కాణిపాకంలో జీను రాజశేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న వీవోఏలకు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉన్న వాళ్ళని తొలగించడానికి సర్క్యులర్ 64ను తీసుకొచ్చి మూడు సంవత్సరాల కాలం పరిమితి పెట్టడం దారుణమన్నారు. రాష్ట్రంలో కోటిమంది మహిళలకు పొదుపుపై అవగాహన కల్పించి వారిని ఆర్థికంగా నిలదక్కుకోవడానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి వీవోఏలను రాష్ట్ర ప్రభుత్వం రకరకాల అడ్డదారుల్లో తొలగించే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ చిత్తూరు జిల్లాలో వీవోఏలపై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘసభ్యులు తీర్మానం లేకుండా ఇష్టారాజ్యంగా తొలగించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. కానీ చిత్తూరు జిల్లాలో మాత్రం ఇష్టారాజ్యంగా తొలగిస్తున్న జిల్లా ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం దురదష్టకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీవోఏలపై 64 సర్క్యులర్‌లో భాగంగా జెండర్ విధానాన్ని తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో చేసిన పోరాటాల ఫలితంగా వేతనాలు కొద్దిగా పెరిగిన కనీసవేతనాలు అమలు కావడం లేదని వాటిని అమలు చేయాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ అమలు చేయాలని, సంఘాల మెర్జింగ్ విధానాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై మరో పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమవుతున్నామని తెలిపారు. మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు డిసెంబర్ 1 నుంచి కార్యక్రమాలు చేపడుతున్నామని ఈ కార్యక్రమాల్లో వీవోఏలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. యూనియన్ గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో సోమల, ఎస్‌ఆర్ పురం, ఇతర మండలాల్లో సంఘాల సభ్యులు తీర్మానం లేకుండా ఇష్టారాజ్యంగా తొలగిస్తున్న ఏపిఎంలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిఆర్‌డిఏ పిడి వీవోఏల సమస్యలపై జిల్లా సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈసమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పోరాటాన్ని ఉధతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు రెడ్డప్ప, కష్ణమ్మ, పరంజ్యోతి, చిత్తూరు జిల్లా కార్యదర్శి పి.నాగరాజు, అన్నమయ్య జిల్లా అధ్యక్షురాలు రాణి, తిరుపతి జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, నాయకులు శ్రీధర్ సుబ్రమణ్యం, అధిక సంఖ్యలో వీవోఏలు పాల్గొన్నారు.