‘విషాద’ ప్రయాణం

Nov 24,2023 22:02
ఘోర రోడ్డు ప్రమాద ఘటన దృశ్యాలు

‘విషాద’ ప్రయాణం ప్రైవేట్‌ కళాశాల బస్సు, కారు ఢ నలుగురి దుర్మరణం ఒకరి పరిస్థితి విషమంప్రజాశక్తి – పిచ్చాటూరురమేష్‌నాయుడు, అతని భార్య పుష్ప, వదిన వనజాక్షి, దగ్గరి బంధువులు భాను, శివమ్మలతో కలిసి ఉత్సాహంగా చెన్నరు పెరంబూరులో శుక్రవారం ఉదయం జరిగిన నిశ్చితార్ధానికి అందంగా అలంకరించుకుని వెళ్లారు. పట్టుచీరల్లో, బంగారు నగలు ధరించి వేడుకలో పాల్గొన్నారు. సాయంత్రం తిరుగు ప్రయాణం అయ్యారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రైవేట్‌ డిగ్రీ కళాశాల బస్సును కారు ఢకొీంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతదేహాలు తలలు పగిలి, మొహంపై రక్తగాయాలై కళావిహీనంగా కనిపించాయి. ఎంతో ప్రయాసతో మృతదేహాలను కారులోనుంచి తొలగించి పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న శివమ్మను తిరుపతి రుయాకు చికిత్స నిమిత్తం తరలించారు. ఎంతో సంతోషంగా నిశ్చితార్ధ వేడుకకు వెళ్లి వస్తున్న ఆ కుటుంబంలో సాయంత్రం విషాదం అలముకుంది. చెన్నరు పెరంబూరులో జరిగిన బంధువుల నిశ్చితార్ధ వేడుకకు వెళ్లి వస్తుండగా కారును ఓ ప్రైవేట్‌ కళాశాల బస్సు ఢకొీనడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన శివమ్మను తిరుపతి రుయాకు చికిత్స నిమిత్తం తరలించారు. తిరుపతి జిల్లా నారాయణవనం పోలీసు స్టేషన్‌ సమీపంలోని తిరుపతి చెన్నరు జాతీయ రహదారిపై సముదాయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో స్కూలు విద్యార్థులకూ స్వల్ప గాయాలయ్యాయి.కారు ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించబోయి ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ డిగ్రీ కళాశాల బస్సును ఢకొీంది. స్థానికుల వివరాల మేరకు… తిరుపతి -చెన్నై జాతీయ రహదారి పై శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు పుత్తూరు లోని శ్రీవిద్య ప్రైవేట్‌ కళాశాల బస్సు, కారు ఢకొీన్నాయి. పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం గ్రామానికి చెందిన రమేష్‌ నాయుడు కుటుంబానికి చెందిన ఐదుగురు పెరంబురులో నిశ్చితార్ధానికి వెళ్లివస్తూ ఈ ప్రమాదంలో మృతి చెందారు. రమేష్‌ నాయుడు(60), అతని భార్య పుష్ప (55), సమీప బంధువు భాను (42), వదిన వనజాక్షమ్మ(60) అలియాస్‌ అమ్ములమ్మ సంఘటన స్థలంలో మతి చెందారు. బంధువు శివమ్మ (55) పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రమేష్‌నాయుడు సిమెంట్‌ అంగడి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరూ విగతజీవులయ్యారు. పుత్తూరు ప్రభుత్వాసుపత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.. ఈ ఘటనలో ప్రైవేట్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులూ స్వల్పంగా గాయపడ్డారు. ఘోర రోడ్డు ప్రమాద ఘటన దృశ్యాలు

➡️