ప్రజాశక్తి-చీమకుర్తి : మండల పరిధిలోని గోనుగుంట గ్రామంలో రైతులు సాగు చేసిన మిర్చిపంటను ఉద్యానవన శాఖ అధికారి డి.సంధ్య బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిరప తోటలకు బొబ్బర,ఆకుపచ్చ తెగులు సోకినట్లు తెలిపారు. తెగుళ్ల నివారణకు డై పెంతూరియాన్ 1.25 గ్రాములు లేదా స్పైరో మెసెఫిన్ 1ఎంఎల్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. ఆకుమచ్చ తెగులు ఆశిస్తే ఆకు మీద గుండ్రంగా గోధుమ రంగు మచ్చలు ఏర్పడి మచ్చ భాగంలో తెల్లటి చుక్క ఏర్పడుతుందన్నారు. తెగులు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఆకులు పండుబారి పోతాయన్నారు. దాని నివారణకు అజాక్సిస్ట్రోబిన్ ఒక మిల్లీమీటరు లేదా డైతేన్ ఎం-45 2.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు.