విద్య కాషాయికరణను ఆపాలి : ఎఐఎస్‌ఎఫ్‌

Nov 29,2023 20:26
మాట్లాడుతున్న రావుల వెంకయ్య

మాట్లాడుతున్న రావుల వెంకయ్య
విద్య కాషాయికరణను ఆపాలి : ఎఐఎస్‌ఎఫ్‌
ప్రజాశక్తి-కందుకూరు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్‌ఎఫ్‌) కందుకూరు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో స్థానిక కోటారెడ్డి భవన్‌లో కందుకూరు నియోజకవర్గ మహాసభ బుధవారం జరిగింది. షేక్‌ మస్తాన్‌ షరీఫ్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా మాజీ ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య పాల్గొన్నారు. వెంకయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్య కాషాయకరణకు తెర లేపుతున్నారని విమర్వించారు.కందుకూరు నియోజకవర్గ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి సురేష్‌, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్‌ఎఫ్‌ నెల్లూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పవన్‌ కిషోర్‌, మస్తాన్‌ షరీఫ్‌ ,జిల్లా నాయకులు శివం వర్మ, డేగ దినేష్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

➡️
మాట్లాడుతున్న రావుల వెంకయ్య విద్య కాషాయికరణను ఆపాలి : ఎఐఎస్‌ఎఫ్‌ ప్రజాశక్తి-కందుకూరు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్‌ఎఫ్‌) కందుకూరు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో స్థానిక కోటారెడ్డి భవన్‌లో కందుకూరు నియోజకవర్గ మహాసభ బుధవారం జరిగింది. షేక్‌ మస్తాన్‌ షరీఫ్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా మాజీ ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య పాల్గొన్నారు. వెంకయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్య కాషాయకరణకు తెర లేపుతున్నారని విమర్వించారు.కందుకూరు నియోజకవర్గ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి సురేష్‌, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్‌ఎఫ్‌ నెల్లూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పవన్‌ కిషోర్‌, మస్తాన్‌ షరీఫ్‌ ,జిల్లా నాయకులు శివం వర్మ, డేగ దినేష్‌ విద్యార్థులు పాల్గొన్నారు.