విద్యార్థులు లక్ష్యం దిశగా వెళితే మంచి ఫలితాలు: కలెక్టర్‌

Nov 30,2023 23:02 #collector, #MLA, #vinukonda

వినుకొండ: ప్రతి విద్యార్థి కష్టపడి చదివి లక్ష్యం దిశగా పయనించినపుడే మంచి ఫలితాలు సాధించవచ్చని పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివ శంకర్‌ లోతేటి అన్నారు. వినుకొండ పట్టణంలోని గురుకుల పాఠశాల బాలుర స్కూల్‌ అదనపు తరగతి గదుల ప్రారం భోత్సవానికి గురువారం జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యా ర్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. ప్రైవేటు కార్పోరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు రాణిస్తున్నారని అన్నారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా హాస్టల్‌ విజిట్‌లో భాగంగా గురుకుల పాఠశాలకు వచ్చానని, విద్యార్థులతో కలిసి నిద్రించినట్లు చెప్పారు. ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలోనే గురుకుల పాఠశాల విద్యార్థి జెట్టి వెంకటేష్‌ 583 మార్కులతో మొదటి ర్యాంక్‌, సోంపల్లి వెంకట సాయి 577 మార్కులతో స్టేట్‌ సెకండ్‌ ర్యాంక్‌ సాధించడం సంతోషకరమన్నారు. గురు కుల పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి సుమారు రూ.1.40 కోట్లు కేటాయించి నట్లు వెల్లడించారు. రూ.18 కోట్ల వ్యయంతో నూతనంగా గిరిజన వసతి గృహాన్ని నిర్మించనున్నా మని , ఇందులో భాగంగా మూడు కోట్లతో పనులు ప్రారం భించామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు చొరవతో బ్రాహ్మణ పల్లి రెవిన్యూ పరిధిలో చెక్క వాగు వద్ద ఐదు ఎకరాల భూమి కేటాయించా మన్నారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ రిజన గురుకుల వసతి గృహాన్ని త్వరలో నిర్మిం చనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అంది స్తున్న అవ కాశాన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోవా లని కోరారు. నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ లను ప్రారంభించిన కలెక్టర్‌, ఎమ్మెల్యేలు ప్రారం భించారు. కార్యక్రమంలో ఆర్డిఓ శేషిరెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిని ఎల్‌. వరలక్ష్మి పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️