‘విజిలెన్స్‌’ వేధింపులకు విద్యార్థి బలి: ఎస్‌ఎఫ్‌ఐ

Dec 1,2023 22:18
విద్యార్థి మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని నిరసన

‘విజిలెన్స్‌’ వేధింపులకు విద్యార్థి బలి: ఎస్‌ఎఫ్‌ఐప్రజాశక్తి – క్యాంపస్‌ తిరుపతి పట్టణంలోని టిటిడి అనుబంధ ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో బి.కామ్‌ ( సిఎ) చదువుతున్న విద్యార్థి ఎస్‌.జితేంద్ర కుమార్‌ మరణానికి కారణమైన విజిలెన్స్‌ అధికారులు, ప్రిన్సిపాల్‌ నారాయణమ్మను తక్షణమే అరెస్ట్‌ చేసి విధుల నుండి తొలగించి మతిపై విచారణ జరిపించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.మాధవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా హాలహర్వి మండలం సిరుగాపురం గ్రామానికి చెందిన జితేంద్ర కుమార్‌ ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల నందు బి.కామ్‌ (సిఎ) చదువుతున్నాడని, గురువారం రాత్రి హాస్టల్‌ లో ఉన్న ఫైర్‌ ఆక్సిడెంట్స్‌ అత్యవసరాల కోసం ఏర్పాటు చేసిన గ్యాస్‌ లతో ఆడుకున్నారని అతడిని విజిలెన్స్‌ అధికారులు చితకబాది అతని దగ్గర నుండి బలవంతంగా క్షమాపణ లేఖ రాయించారని, మనస్థాపం చెందిన విద్యార్థి శుక్రవారం పాకాల రైల్వే స్టేషన్‌ దగ్గర లో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. విజిలెన్స్‌ అధికారులు విద్యార్థులను రెగ్యులర్‌ గా కొడుతున్నారని, ప్రిన్సిపాల్‌ దష్టి కి తీసుకెళ్లినా ఏ మాత్రం స్పందించడం లేదని, తక్షణమే నారయణమ్మను తొలగించి విచారణ జరిపి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.విద్యార్థి మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని నిరసన

➡️