వచ్చే నెలాఖరకు రబీ నాట్లు పూర్తికి చర్యలు

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి బోసుబాబు

ప్రజాశక్తి-అంబాజీపేట

సాగునీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని డిసెంబర్‌ నెలాఖరు నాటికి రబీనాట్లు పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసుబాబు సూచించారు. అంబాజీపేట వ్యవసాయ శాఖ కార్యాలయంలో బుధవారం సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్‌జెవి.రామ్మోహనరావు అధ్యక్షతన పి.గన్నవరం సబ్‌ డివిజన్‌ పరిధిలో పి.గన్నవరం మామిడికుదురు, అంబాజీపేట, మండలాల విఎఎ, విహెచ్‌ఎలకు ప్రత్యామ్నాయ పంటలు మరియు ముందస్తు రబీ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధికారి మాట్లాడుతూ ప్రతి రైతు డిసెంబర్‌ నెలాఖరు లోగా వెదజల్లు పద్ధతి ద్వారా నాట్లు పూర్తి అయితే వచ్చేనెలాఖరుకు కోతకు వస్తుందన్నారు. గ్రామస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి కాలువ చివరి భూములలో ఆరుతడి పంటలు వేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు సిహెచ్‌డి. విజయకుమార్‌, కళ్యాణ్‌ సూర్య కుమార్‌, బి. మదుల, ఏరువాక ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.భవాని, తదితరులు పాల్గొన్నారు.

 

➡️