వచ్చేనెల 1 నుండి ఆరోగ్య సురక్ష రెండో విడత

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని వచ్చేనెల 1వ తేదీ నుండి నిర్వహించనున్నట్లు పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. దీనిపై ఈనెల ఒకటి నుండే ఎఎన్‌ఎంలు ప్రజల ఇళ్లకు వెళ్లి బ్రోచర్లను అందించాలని చెప్పారు. ఈ మేరకు బ్రోచర్లను జెసి తన ఛాంబర్‌లో జిల్లా వైద్యారోగ్య శాఖాధికాధికారి డాక్టర్‌ రవి, ఆరోగ్యశ్రీ సమన్వయకర్త డాక్టర్‌ విజరు ప్రకాష్‌, టీమ్‌ లీడర్‌ కె.సంపత్‌ కుమార్‌తో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ఈ కార్యక్రమంపై ఎఎన్‌ఎం (సచివాలయ ఆరోగ్య మిత్రాలు)లకు ఇప్పటికే శిక్షణిచ్చామని, ఎఎన్‌ఎంలు వారి గ్రామాల్లోని ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ బ్రోచర్‌ను అందించటంతో సరిపెట్టకుండా అందులోని ప్రతి విషయాన్నీ ప్రజలకు అర్థవంతంగా వివరించాలని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం యొక్క లక్ష్యాల్ని, ప్రయోజ నాల్ని తెలపడంతోపాటు ఆరోగ్యశ్రీ యాప్‌ను ప్రతి కుటం బంలో కనీసం ఒక్కరి ఫోన్‌లో అయినా ఇన్‌స్టాల్‌ చేసి, లాగిన్‌ చేయించాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ యాప్‌లో ఉన్న ప్రతి ఆప్షన్‌ను ప్రజలకు వివరించాలని చెప్పారు.

➡️