లింగ నిర్థారణ నిషేధ చట్టం అమలుకు చర్యలు

సర్టిఫికెట్లు అందజేస్తున్న జెసి తదితరులు

ప్రజాశక్తి-కాకినాడ

గర్బస్థ పిండ లింగ నిర్థారణ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ .ఇలక్కియా అన్నారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలోని విధాన గౌతమి సమావేశ మందిరంలో పిసి అండ్‌ పిఎన్‌డిటి యాక్ట్‌ 1994, 1996 రూల్స్‌పై ఓరియంటేషన్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో గర్బస్థ పిండ లింగ నిర్థారణ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలుచేసేందుకు జిల్లాస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, విస్తతంగా తనిఖీలు నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో చట్టం అమలు తీరుపై సమావేశంలో చర్చించారు. సేవ్‌ గర్ల్‌ ఛైల్డ్‌, లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై ఆశాలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ వర్కర్లు, సూపర్‌వైజర్లు తదితరులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశించారు. అడిషనల్‌ సెషన్‌ డిస్టిక్‌ జడ్జ్‌ పి.కమలాదేవి మాట్లాడుతూ మూడు చట్టాలపై శిక్షణ ఇస్తామన్నారు. దిశ డి ఎస్‌ పి మెహర్‌ జైరాం ప్రసాద్‌ మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, లైంగిక వేధింపులు చేసిన శిక్షలు కఠినంగా ఉంటాయని ఆయన అన్నారు. జిల్లా వైద్య శాఖ అధికారి జె. నరసింహ నాయక్‌, కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ డిపార్ట్మెంట్‌ హెడ్‌ డాక్టర్‌ పి.ఉమామహేశ్వరరావు జిజిహెచ్‌ సూపరిండెంట్‌ డాక్టర్‌ లావణ్య కుమారి, జిజిహెచ్‌ సూపరిండెంట్‌ డా. స్వప్న తదితరులు హాజరయ్యారు. సేవ్‌ గర్ల్‌ ప్రోగ్రాంలో విశిష్ట సేవలు అందించిన డాక్టర్లు , వైద్య సిబ్బందికి మెమొంటో, సర్టిఫికెట్‌ తో వారిని సత్కరించారు.

 

➡️