రోడ్డు విస్తరణ పరిహార చెక్కులు అందజేత

 ప్రజాశక్తి -మాధవధార : జివిఎంసి 51వ వార్డు పరిధి మాధవధార అంబేద్కర్‌ కాలనీ-3లో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు, దుకాణాలు నష్టపోయిన పలువురికి ప్రభుత్వం మంజూరు చేసిన నష్ట పరిహార చెక్కులను మాధవధార వుడా కమ్యూనిటీ హల్లో ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు, వార్డు కార్పొరేటర్‌ రెయ్యి వెంకటరమణతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కెకె.రాజు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా వైసిపి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజా పక్షాన నిలబడి పాలన సాగిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్‌ ప్లానింగ్‌ ఎసిపి రామకృష్ణ, టిపిఒ విజరుకుమార్‌, పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారావుమాస్టర్‌, పైడి శ్రీను, నాయకులు దమయంతి, రాణి, రత్నం, లక్ష్మణ్‌, శ్రీను, శ్యామ్‌, రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️