ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్ : వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి మృతి చెందాదంటూ ఆగ్రహానికి గురైన బంధువులు ఒ ప్రైవేటు ఆస్పత్రికి దాడి చేయగా వైద్యుడూ తీవ్రంగా గాయపడ్డాడు. సత్తెనపల్లి పట్టణంలో ఆదివారం చోటుచేసుకున్న ఘటనపై మృతుని బంధువులు వివరాల ప్రకారం.. బెల్లంకొండ మండలం వన్నాయపాలేనికి చెందిన పత్తిపాటి ప్రసాద్ (44)కు గుండె నొప్పి రావటంతో కుటుంబ సభ్యులు సత్తెనపల్లి పట్టణంలోని ఒ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం 1.44 గంటలకు ఆస్పత్రికి తీసుకురాగా గుండె వైద్యులు అందుబాటులో లేకపోవడంతో మత్తు డాక్టర్ రెండు గంటల తర్వాత వచ్చి చికిత్స చేశారు. అయితే ఆ తర్వాత కొద్ది సేపటికే ప్రసాద్ మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన మృతుని బంధువులు ఆస్పత్రిపై దాడిచేసి కంప్యూటర్లను ధ్వంసం చేశారు. మత్తు డాక్టర్‌పై దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాడి విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. గాయపడిన డాక్టర్‌ను సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాధమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. మృతుని బంధువులు, డాక్టర్‌తో పట్టణ సిఐ ఆస్పత్రిలో ఆందోళన చేస్తున్న మృతుని బంధువులుప్రభాకర్ చర్చిస్తున్నారు. ఇదిలా ఉండగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భర్త మృతి చెందాడని మృతుని భార్య నాగరాణి ఆరోపించారు. ఆస్పత్రిని సీజ్ చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. మతునికి భార్య నాగరాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని కుమార్తె గాయత్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.