ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్ : రైల్వే ప్రైవేటీకరణ ఆపాలని, ఆ శాఖలోని ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, సిఐటియు రాష్ట్ర నాయకులు ఎం.అయ్యప్ప రెడ్డి డిమాండ్ చేశారు. రైల్వే ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ సిఐటియు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలు రైల్వేస్టేషన్ వద్ద గురువారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైల్వే ప్రైవేటీకరణ ఆపాల న్నారు. నేడు ఏ రైలు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. కార్పొరేటీ కన్నా ప్రైవేట్ వ్యవస్థ ప్రజలను కొల్లగొట్టుతుందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోడీ ప్రజల ఆస్తులు, రైల్వే, ఎల్‌ఐసి, విమానాశ్రయాలు లాంటి పెద్దపెద్ద సంస్థలను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తు న్నారన్నారు. రైల్వేను ప్రైవేటీకరణ చేయటం సామాన్య ప్రజలకు ప్రయాణానికి దూరం చేయ డమేనని తెలిపారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు జివి. కొండారెడ్డి మాట్లాడుతూ రైల్వేలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. ప్యాసింజర్లను పున రుద్ధరించాలలన్నారు. ప్రజా రవాణా సౌకర్యాన్ని అభివద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు బివి.రావు, నగర అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్.రాంబాబు, తంగిరాల మహేష్ ,నగర నాయకులు తంబి శ్రీనివాసులు ,ఎస్‌డి.హుస్సేన్ పాల్గొన్నారు