ప్రజాశక్తి-కాకినాడరైల్వే ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ సిఐటియు రాష్ట్ర పిలుపులో భాగంగా కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేశారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్, సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే రంగాన్ని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చూస్తోందన్నారు. ఇప్పటికే రైల్వే ప్లాట్‌ఫామ్‌లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిందని రైల్వే రంగానికి కేటాయించే నిధుల్లో కూడా కోతలు విధిస్తోందన్నారు. కోవిడ్ కాలం నుంచి సీనియర్ సిటిజన్స్, మహిళలు, చిన్నపిల్లలకు రైల్వే టికెట్లపై ఇచ్చే రాయితీలను పూర్తిగా తగ్గించేసారని ఇది చాలా దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి వెంకట రమణ, వి.చందర్రావు, సిహెచ్.వేణి, ఎం.నాగలక్ష్మి, టి.రాణి, సూర్యకుమారి, నాగమణి పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్న సిఐటియు నాయకులు